భారతదేశం, జనవరి 7 -- సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల నుంచి వెళ్లేవారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాయి. మహిళల కోసం స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ పథకం కింద పెద్ద సంఖ్యలో బస్సులను కేటాయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక సర్వీసుల నిర్వహణ ప్రణాళికలను సవరించింది.

ఏపీఎస్‌ఆర్టీసీ కార్యనిర్వాహక సంచాలకులు(ఆపరేషన్స్) ఎ. అప్పల రాజు ఒక ప్రకటనలో మాట్లాడారు. ఈ సంవత్సరం జిల్లా కేంద్రాలు, మండలం, పట్టణాలు, గ్రామాలకు ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ తన సంక్రాంతి 2026 వ్యూహంలో భాగంగా రాష్ట్రంలోని సర్వీసులకు ప్రాధాన్యత ఇవ్వాల...