భారతదేశం, మే 19 -- ఈ మే నాలుగో వారంలో ఓటీటీల్లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే, మరీ క్రేజ్ ఉన్న భారీ సినిమాలు ఏవీ ఈ వారంలో రావడం లేదు. మోస్తరు రేంజ్ చిత్రాలు, సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. వీటిలో ఐదు రిలీజ్‍లు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఓ మలయాళ మూవీ రెండేళ్ల తర్వాత తెలుగులో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవి..

పెండులమ్ సినిమా తెలుగు డబ్బింగ్‍లో ఈ గురువారం మే 22వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. రెజన్ ఎస్ బాబు దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం మలయాళంలో 2023 జూన్‍లో థియేటర్లలో విడుదలైంది. అందుకు రెండేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగు డబ్బింగ్‍లో ఈటీవీ విన్‍లోకి ఈ చిత్రం వస్తోంది. పెండులమ్ సినిమాలో విజయ్ బాబు, అనుమోల్, రమేశ్ పిషరోడీ లీడ్ రోల్స్ చే...