Hyderabad, జూలై 27 -- అరుణగిరి ఆర్ట్స్, కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫైటర్ శివ. ఈ ఫైటర్ శివ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. దీంతో ఫైటర్ శివ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా మొదలుపెట్టారు మేకర్స్.

ఈ క్రమంలోనే ఫైటర్ శివ ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా విడుదల చేశారు. చుట్టూ గన్స్, ఆ గన్స్ మధ్యలో గ్యాంగ్‌స్టర్స్, పోలీసులు, ఇతర వ్యక్తులు ఉంటూ ఇంటెన్సివ్‌గా ఉంది. రక్తాన్ని మైమరిపించేలా రెడ్ కలర్‌లో ఫైటర్ శివ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు.

ఇకపోతే ఫైటర్ శివ సినిమాకు ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మణికంఠ కథానాయకుడుగా, ఐరా బన్సాల్ హీరోయిన్‌గా నటించారు. అలాగే ఫైటర్ శివ మూవీలో కమెడియన్, యాక్టర్ సునీల్ ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌ అనే కీలక పాత...