భారతదేశం, డిసెంబర్ 2 -- బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు ధర మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో భారీ పతనాన్ని చూస్తున్నాయి! ట్రేడింగ్​ మొదలవ్వగానే బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ స్టాక్​ 9శాతం మేర నష్టపోయింది. అనంతరం కాస్త రికవర్​ అయ్యి, ఉదయం 11 గంటల 15 నిమిషాల సమయానికి 6.3శాతం నష్టాలతో రూ. 97.8 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఈ స్టాక్​లో తాజా ఫాల్​కి ప్రధాన కారణం బ్లాక్ డీల్! ఈ డీల్​ ద్వారా 19.5 కోట్ల షేర్లు (కంపెనీ ఈక్విటీలో 2.35% వాటా- రూ. 1,890 కోట్ల వాల్యూ) రూ. 97 వద్ద విక్రయించడం జరిగింది.

బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ కంపెనీ ప్రమోటర్​ అయిన బజాజ్​ ఫైనాన్స్​, సంస్థలో తమకున్న వాటాలో 2% వరకు విక్రయించడానికి యోచిస్తోంది. ఈ విషయాన్ని బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ సోమవారం ఎక్స్​ఛేంజ్​కి సమాచారం అందించింది.

"కనీస పబ్లిక్ వాటా నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి, కంపెనీ ప్రమోటర...