భారతదేశం, ఆగస్టు 20 -- ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తన ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తొలి త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు నమోదు చేయడంతో, ఉద్యోగులకు సగటున 80 శాతం పనితీరు బోనస్ (Performance Bonus) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ బోనస్ వ్యక్తిగత పనితీరు రేటింగ్‌ల ఆధారంగా ఉంటుందని కంపెనీ అంతర్గత మెమో ద్వారా తెలుస్తోంది.

మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, బ్యాండ్ 6, అంతకంటే తక్కువ స్థాయిలోని ఉద్యోగులందరికీ ఈ త్రైమాసిక బోనస్ లభిస్తుంది. ఇందులో జూనియర్, మిడ్-లెవల్ ఉద్యోగులు ఉంటారు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సగటు బోనస్ 65 శాతం మాత్రమే కావడం గమనార్హం.

పనితీరు స్థాయి (performance level) ఆధారంగా బోనస్ శాతాన్ని నిర్ణయిస్తారు.

పీఎల్4 (PL4) ఉద్యోగులకు: వీరికి 80 నుంచి 89 శాతం వరకు బోనస్ లభిస్తుంది. 'అత్యుత్తమ' (Outstanding) పనితీరు కనబరిచిన వా...