భారతదేశం, జూలై 22 -- ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ రూల్ చేస్తున్నాయి. అయితే మరోవైపు టాక్ షోలకు కూడా మంచి ఆదరణ ఉంది. సెలబ్రిటీల టాక్ షోకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ ఓటీటీ సంస్థ క్రేజీ టాక్ షోతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. దీని అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

బాలీవుడ్ లో కాజోల్, ట్వింకిల్ ఖన్నాలకు వేరే లెవల్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు క్యూట్ భామలు కలిసి టాక్ షోతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' పేరుతో ఓటీటీలోకి టాక్ షో రాబోతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ టాక్ షో స్ట్రీమింగ్ కాబోతోంది.

టాక్ షో పేరును అనౌన్స్ చేస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ''వాళ్ల దగ్గర టీ ఉంది. దీన్ని మిస్ చేయడం టూ మచ...