భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఇండియాలో క్రికెట్ అంటే ఓ మతం. క్రికెటర్లు దేవుళ్ల కంటే తక్కువ కాదంటే అతిశయోక్తి కాదు. అంతలా మన దేశ ప్రజలకు క్రికెట్ అంటే పిచ్చి. అలాంటి క్రికెట్ దేశం ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసిస్తోంది. ఐసీసీ టోర్నీల్లో అదరగొడుతోంది. రెండేళ్లలో ఏకంగా అయిదు ప్రపంచకప్ లు ఖాతాలో వేసుకుంది. ఓ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

ఇటీవల ఐసీసీ అబ్బాయిల అండర్-19 ప్రపంచకప్ లో ఇండియా విజేతగా నిలిచింది. మన కుర్రాళ్లు అదరగొట్టారు. ఫైనల్లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడారు. ఇప్పుడు ఇండియాలో టీ20 పురుషుల ప్రపంచకప్ జరుగుతోంది. దీంతో దేశాన్ని మరోసారి క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో క్రికెట్లో ఇండియా డామినెన్స్ చూస్తే ఔరా అనకుండా ఉండలేం.

ఐసీసీ ప్రపంచకప్ లో 2024 నుంచి ఇండియా ఆటతీరు మామూలుగా లేదు. ఏ ఐసీసీ టోర్నీ అ...