భారతదేశం, నవంబర్ 12 -- ఒక భారతీయ టెక్నాలజీ నిపుణుడు, H-1B వీసా హోల్డర్, తన సంస్థ, దాని భారతీయ సంతతి CEO తమను బలవంతంగా పని చేయించుకునే (Coerced Labor) పరిస్థితిలో ఇరికించారని, వేతనాల దొంగతనానికి (Wage Theft) పాల్పడ్డారని, కులం ఆధారంగా దోపిడీ చేశారని ఆరోపిస్తూ అమెరికాలో న్యాయ పోరాటం ప్రారంభించారు. ఈ విషయాన్ని కాలిఫోర్నియాకు చెందిన వార్తా సంస్థ బ్రెయిట్‌బార్ట్ న్యూస్ వెల్లడించింది.

అమృతేశ్ వల్లభనేని అనే ఈ టెక్ నిపుణుడికి గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు మద్దతు ఇస్తామని మొదట్లో హామీ ఇచ్చింది కంపెనీ. కానీ, ఆ హామీనే వాడుకుని తమ షరతులకు అంగీకరించేలా బలవంతం చేసింది. ఒకవేళ పాటించకపోతే దేశం నుంచి బహిష్కరిస్తామని (Deportation) బెదిరించినట్లు వల్లభనేని తన దావాలో పేర్కొన్నారు.

వల్లభనేని తరఫున ఈ దావాను సిద్ధం చేయడంలో సహాయం చేసిన కన్సల్టెంట్ జయ్ పామర్, బ్రెయి...