భారతదేశం, నవంబర్ 1 -- శ్రీ‌వారి సేవ‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని ఈవో ఛాంబ‌ర్ లో శ్రీ‌వారి సేవ‌పై అధికారులతో సమీక్షించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో సింఘాల్ మాట్లాడుతూ.. శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు చక్కటి సేవలు అందించవచ్చని ఆయన అన్నారు. అదేవిధంగా ఐఐఎం మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖకు సంబంధించిన ముఖ్యమైన శిక్షకులతో వచ్చే నవంబర్ నెలలో శిక్షణకు సంబంధించి ఆడియో, వీడియో విజువల్స్, ట్రైనింగ్ మెటీరియల్ సిద్ధం చేయాలన్నారు. ఇదివరకే ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న గ్రూప్ సూపర్వైజర్లు, ట్రైనర్లకు డిసెంబర్, జనవరి మాసాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.

ఈ ట్రైనింగ్ లో శ్రీ వేంకటేశ్వర వైభవం...