భారతదేశం, ఏప్రిల్ 26 -- ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే పైలెట్‌ గ్రామాల్లో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిగతా గ్రామాల్లో అర్హులను గుర్తించేందుకు సర్వే బృందాలు రంగంలోకి దిగాయి. ఒక్కో మండలాన్ని జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గ్రామంలో.. గెజిటెడ్‌ స్థాయి అధికారి సుమారు 200 దరఖాస్తులను సర్వే చేస్తున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి.

1.రెండో దఫా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు సంబంధించి అర్హతలు ఏంటి, జాబితాలో అనర్హులు ఎంతమంది ఉన్నారో సర్వే ద్వారా తేల్చనున్నారు.

2.దరఖాస్తుదారు వృత్తి, ప్రస్తుత ఇంటి స్థితిగతులు, ఇంటి నిర్మాణానికి సొంత జాగా ఉందా.. ఒకవేళ స్థలం ఉన్నా దానికి సంబంధించిన పట్టా, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ ఉన్నాయా పరిశీలిస్తున్నారు.

3.గ్రామీణ ప్రాంతాల్లో అయితే దరఖాస్తు చేసుకున్న...