భారతదేశం, సెప్టెంబర్ 2 -- దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా రాక కోసం ఏళ్ల తరబడి జరిగిన నిరీక్షణకు ఇటీవలే తెరపడిన విషయం తెలిసిందే. దేశంలో టెస్లా ఎంట్రీని "నెక్ట్​ బిగ్​ థింగ్​"గా భావించారు . అయితే, ఇక్కడి మార్కెట్​ విషయంలో టెస్లాకు షాక్​ తగిలినట్టు తెలుస్తోంది. భారత్​ మార్కెట్​లో తమ కార్ల విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవని టెస్లా టీమ్​ అభిప్రాయపడుతున్నట్టు వార్తలు బయటకు వస్తున్నాయి.

జులై మధ్యలో అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి టెస్లా మోడల్​ వై ఎలక్ట్రిక్​ కారుకు ఇప్పటివరకు 600కు పైగా కార్లకు మాత్రమే ఆర్డర్లు వచ్చాయని, ఇది కంపెనీ అంచనాల కంటే తక్కువని టెస్లా వర్గాలు చెబుతున్నట్టు పలు నివేదిక పేర్కొంది.

డిమాండ్​ లేకపోవడంతో, అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​కి చెందిన టెస్లా ఈ ఏడాది భారత్‌కు దిగుమతి చేసే కార్ల సంఖ్యను తగ్గించి, 350 నుంచి 50...