భారతదేశం, జూలై 12 -- ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి, తమ సోషల్ మీడియాలో "Coming Soon" అనే క్యాప్షన్‌తో కూడిన టెస్లా లోగో, 'ఇండియా' టెక్ట్స్​ ఉన్న టీజర్‌ను విడుదల చేసింది.

దేశంలో తమ మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించేందుకు టెస్లా సన్నాహాలు చేస్తోంది. ఇది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్​లో ఉంటుంది. మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ జులై 15న ప్రారంభం కానుంది.

టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటికే భారతదేశానికి చేరుకున్నాయి. ఇటీవల ముంబైలోని బీకేసీలోని భవనం వెలుపల వీటిని ఆఫ్​లోడ్​ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

టెస్లా తన రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను దేశ రాజధాని దిల్లీలో ప్రారంభించనుంది. ప్రస్తుతం బెంగళూరులో టెస్లాకు కార్యాలయం ఉంది. అలాగే కర్ణాటక, గురుగ్రామ్‌లలో వేర్​హౌస్​ కోసం కూ...