భారతదేశం, డిసెంబర్ 5 -- ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాల ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే వీటి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇవి డొమినో ఎఫెక్ట్​లా మారి, దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి.

ఎయిర్‌బస్ ఏ320లోని సాంకేతిక సమస్యల కారణంగా మొదలైన అంతరాయాలు.. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్​డీటీఎల్​) నిబంధనలను అమలు చేయాలన్న కోర్టు ఆదేశాలు గందరగోళానికి దారితీశాయి. విమాన కార్యకలాపాల మధ్య పైలట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతిని అందించే ఈ నిబంధనలను జనవరి 2024లో ప్రవేశపెట్టినప్పటికీ, నవంబర్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుండగా, విమానయాన సంస్థలు మరో పొడిగింపును ఆశించాయి. కానీ అది జరగలేదు.

(తాజా సమాచారం ప్రకారం ఇండిగో సంస్థ దిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లో తమ డిపార్చర్​ సేవలను నిలిపివేసింది.)

పైలట్, సిబ్బంది అలసటను...