భారతదేశం, ఫిబ్రవరి 9 -- చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. ఈ పనులు చేయొచ్చా? ఈ పనులు చేయకూడదా? అలాగే ఈరోజు ఈ పనులు చేయొచ్చా? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఈరోజు చాలా మందిలో ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

చాలా మంది ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇంట్లో శివలింగం ఉండకూడదని కూడా చెప్తూ ఉంటారు. ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించవచ్చా? అలా ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించడం తప్పా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.. ఇంట్లో శివలింగం ఉండొచ్చు, తప్పులేదు. నిజానికి ఇంట్లో బంగారం, వెండి, ఇత్తడి లాంటి లోహాలతో చేసిన శివలింగాన్ని పెట్టుకుంటే నియమ నిష్టలను తప్పక పాటించాలి. అలా పూజిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

శివలింగం ఎప్పుడూ కూడా రెండు అంగుళాలకు మించి ఉండకుండా చూసుకోవాలి. అంటే బొటనవేలు పరిమాణానికి మించి ఉండకూడదు. స్పటిక లింగం, బాణలింగం వ...