భారతదేశం, ఏప్రిల్ 21 -- మీరు కారు, బైకు ఇలా ఏ వాహనం నడపాలన్నా ముఖ్యంగా ఉండాల్సినవి ఆ వాహన ఆర్​సీ, ఇన్సూరెన్స్​, పొల్యూషన్​ సర్టిఫికెట్​తో పాటు ప్రధానంగా డ్రైవింగ్​ లైసెన్స్. కొత్తగా డ్రైవింగ్​ లైసెన్స్​ తీసుకున్నప్పుడు వయసు ఆధారంగా కొన్నేళ్ల గడువుతో జారీ చేస్తారు. ఈ గడువు ముగిసేలోగా రెన్యూవల్​చేసుకోవాలి. గడువు ముగిసిన 30 రోజుల్లో రెన్యువల్ చేసుకోకుంటే ఫైన్​ చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసి చాలా రోజులైతే జరిమానాతో పాటు మళ్లీ కొత్త డ్రైవింగ్​ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. అందుకే డ్రైవింగ్​ లైసెన్సుపై గడువును చూసుకుని రెన్యూవల్​ చేసుకోవడం మంచి పద్ధతి.

మొదట రవాణా శాఖ అధికారిక వెబ్​సైట్లోకి https://transport.telangana.gov.in/ వెళ్లి డ్రైవింగ్​ లైసెన్సు సంబంధిత సేవల్లో డ్రైవింగ్​ లైసెన్సు రెన్యూవల్​పై క్లిక్​ చేయాలి. ఇప్పుడు రెన్య...