భారతదేశం, జనవరి 23 -- ఇటీవల కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది తాప్సీ పన్ను. ఆమె ప్రధాన పాత్రలో నటించిన అలాంటి మరో సినిమానే 'అస్సీ'. ఇదో కోర్టు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. దీనికి అనుభవ్ సిన్హా డైరెక్టర్. తాస్పీతో అతను చేస్తున్న మూడో సినిమా ఇది. శుక్రవారం (జనవరి 23) ఈ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఇంక్ నిండిన ముఖంతో తాప్సీ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

తాప్సీ లీడ్ రోల్ ప్లే చేస్తున్న మూవీ 'అస్సీ'. ఈ బాలీవుడ్ సినిమా నుంచి ఇవాళ రిలీజైన మోషన్ పోస్టర్ వైరల్ గా మారింది. ఇది సినిమా టోన్, కథనంపై ఉత్కంఠను మరింత పెంచింది. ఈ క్లిప్ లో ఒక మహిళ రైలు పట్టాలపై పరిగెత్తుతుంది. ముగ్గురు వ్యక్తులు వెంటపడుతుండగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. అప్పుడే తాప్సీ ముఖం ఇంక్ తో పూర్తిగా నిండిన లుక్ కనిపిస్తుంది. 'అర్జెంట్ వాచ్ (అత్యవసరంగ...