భారతదేశం, ఫిబ్రవరి 8 -- హైదరాబాద్‌ : నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా పుకార్లు వ్యాపిస్తున్నాయి. రెండు కీలక కేసులకు సంబంధించి సాక్ష్యాలు కాలిపోయాయని తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా రెండు హై ప్రొఫైల్ కేసులకు సంబంధించిన సాక్ష్యాలు సురక్షితంగా, చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టం చేశారు.

ప్రమాద స్థలానికి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్న మాలిక్యులర్ బయాలజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోయల్ మాట్లాడారు. 2015 ఓటుకు నోటు కేసు లేదా 2024 ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించిన ఏ సామాగ్రి కూడా అగ్నిప్రమాదంలో ధ్వంసం కాలేదని శిఖా గోయల్ తెలిపారు. ఈ ఘటన జరిగినప్పటి నుండి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఊహా...