భారతదేశం, ఫిబ్రవరి 7 -- డబ్ల్యూపీఎల్ (ఉమెన్స్​ ప్రీమియర్​ లీగ్​)​ 2026 టైటిల్​ విన్నర్​ ఆర్సీబీ మహిళల జట్టుకు బజాజ్​ ఆటో ప్రత్యేకమైన గిఫ్ట్​ని ప్రకటించింది. ఫ్రాంచైజీతో సంస్థ అసోసియేషన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టులోని ప్రతి సభ్యురాలికి ఒక చేతక్ సీ25 ఎలక్ట్రిక్​ స్కూటర్​ని బహుమతిగా ఇచ్చింది.

బజాజ్​ సంస్థ నుంచి వస్తున్న అఫార్డిబుల్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఈ సీ25.

బజాజ్​ చేతక్ లైనప్‌లో అత్యంత సరసమైన మోడల్‌గా నిలిచిన కొత్త సీ25, రోజువారీ నగర ప్రయాణికుల కోసం తయారైంది. ఇది చేతక్ 30, 35 సిరీస్ మోడళ్ల కంటే తక్కువ ధరకు లభిస్తుంది. కానీ అదే బలమైన మెటల్-బాడీ మన్నికను కలిగి ఉండటం విశేషం.

వేగం: హబ్-మౌంటెడ్ మోటార్ సహాయంతో ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ గరిష్టంగా గంటకు 55 కి.మీల వేగంతో ప్రయాణించగలదు.

బ్యాటరీ, రేంజ్: ఇది 2.5 కేడబ్ల్యూహెచ్​ ...