భారతదేశం, నవంబర్ 3 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఘటనతో బస్సులోని చాలా మంది ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 20 మంది మరణించారు. ఇందులో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయరహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్ బస్సు వెళ్తోంది. ఈ సమయంలో కంకర లారీ ఢీ కొట్టి బస్సు మీద పడిపోయింది. లారీలో ఉన్న కంకర పడడంతో బస్సులో కూరుకుపోయారు ప్రయాణికులు. ఘటన సమయంలో వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. జేసీబీ తెప్పించి తొలగించారు. ఈ ఘటనలో 20 మంది మరణించారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.