భారతదేశం, నవంబర్ 2 -- విద్యార్థులు, విద్యావేత్తలు, నిపుణుల కోసం SWAYAM పోర్టల్ ద్వారా ఐదు ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులను అందుబాటులోకి తెచ్చింది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ. క్రీడలు, విద్య, సైన్స్, ఆర్థికం వంటి అన్ని రంగాల్లో అవసరమైన ఏఐ, డేటా సైన్స్ నైపుణ్యాలను అందించడమే ఈ కోర్సుల లక్ష్యం!

ఈ కోర్సుల్లో పైథాన్‌తో ఏఐ/ఎంఎల్​, ఏఐతో క్రికెట్ అనలిటిక్స్‌, విద్యావేత్తల కోసం ఏఐ, ఫిజిక్స్‌లో ఏఐ, కెమిస్ట్రీలో ఏఐ, అకౌంటింగ్‌లో ఏఐ వంటివి ఉన్నాయి. ప్రతి ప్రోగ్రామ్ కూడా వాస్తవ ప్రపంచ అనువర్తనాలు (రియల్-వరల్డ్ అప్లికేషన్స్), కేస్ స్టడీస్ ద్వారా హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్ అందించేలా రూపొందించారు.

ఏఐతో క్రికెట్ అనలిటిక్స్‌: క్రీడా విశ్లేషణ (స్పోర్ట్స్ అనలిటిక్స్) పై దృష్టి సారించే ఈ కోర్సులో.. క్రికెట్‌లో డేటా సైన్స్‌ను ఎలా ఉపయోగిస్తారో నేర్పు...