భారతదేశం, ఏప్రిల్ 24 -- ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ జరుగుతోంది. సెర్చింగ్ ఆపరేషన్, ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుండి వేలాది మంది సిబ్బంది ఈ ఆపరేషన్‌లో ఉన్నారు. తాజాగా బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు.

సరిహద్దు అటవీ ప్రాంతాలలో నక్సలైట్ల ఉనికిని, వారి మౌలిక సదుపాయాలను నిర్మూలించే లక్ష్యంతో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్‌లో అనేక భద్రతా విభాగాలు పాల్గొంటున్నాయి. తెలిసిన సమాచారం ప్రకారం నక్సలైట్లను అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. కింద సైనికులు మొత్తం ఓ గుట్టను చుట్టుముట్టారని చెబుతున్నారు. ఇక్కడ 100 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారు. వారిలో టాప్ క్యాడర్ నక్సలైట్లు కూడా ఉన్నారు.

బస్తర్ ప్రాంతంలో ప...