భారతదేశం, మే 16 -- ఆగస్టు నెలకు సంబంధించి టీటీడీ టికెట్లు విడుదల అయ్యాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగంగా ఆగష్టు-2025 కి సంబంధించిన సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు మే 19 వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

ఆగస్టు నెలలో ఆర్జిత సేవల టిక్కెట్ల కోసం రిజిస్ట్రేషన్లు మే 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21 ఉదయం 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఆగష్టు-2025 కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ కోసం 22వ తేదీ ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.

ఆగష్టు నెలలో తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవలకు ఆన్‌లైన్ సేవ (వర్చువల్ దర్శనం) కనెక్ట్ చేయబడిన దర్శన కోటా బుకిం...