భారతదేశం, ఆగస్టు 18 -- అల్లూరి సీతారామరాజు జిల్లాలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ, చింతగుప్ప ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు జరిపారు. తనిఖీల సందర్భంగా మావోయిస్టులు. భద్రతా బలగాలపై కాల్పులు జరిపేందుకు యత్నించారని. కానీ పారిపోయారని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. ఈ క్రమంలో ఒక మావోయిస్టును అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

అరెస్టయిన వ్యక్తిని ఒడిశాలోని కోరాపుట్ జిల్లా భలియాపుట్టు గ్రామానికి చెందిన చైతో అలియాస్ నరేష్ గా గుర్తించారు. నరేష్ 2011లో జన నాట్యమండలి బృందంలో చేరాడు. 15 ఏళ్లకే మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడని సమాచారం. ఆ తర్వాత 2017లో బోయిపరిగూడ దళం కమాండర్ గా ఎదిగాడు. ప్రస్తుతం డివిజనల్ కమిటీ మెంబర్ (డీసీఎం), పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తూ మావోయిస్టు కార్యకలాపాల...