భారతదేశం, ఫిబ్రవరి 15 -- టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. బన్నీని కలవాలంటే దాదాపు '42 కఠిన నిబంధనలు' పాటించాలంటూ ఒక బ్రాండ్ స్ట్రాటజిస్ట్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

అయితే, ఈ ఆరోపణలను అల్లు అర్జున్ టీమ్ ఇప్పటికే ఖండించడమే కాకుండా, సదరు వ్యక్తిపై న్యాయపరమైన చర్యలు కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసిన నటీనటులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

తాజాగా మలయాళ నటుడు శివ హరిహరన్ ఈ వివాదంపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ఇటీవల ఒక శీతల పానీయం ప్రకటన షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫోటోను ఆయన పంచుకున్నారు.

"బన్నీ గారికి సంబంధించిన ఆ 42 నిబంధనల వార్తలపై నాకు చాలా మంది అభిమానుల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. ...