భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్ పాటించాలంటూ బ్రాండ్ మేనేజర్ కావేరీ బారువా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. కళ్ళల్లోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అంటూ ఆమె చేసిన ఆరోపణలను బన్నీ టీమ్ తీవ్రంగా ఖండించింది. ఆమెపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించింది.

'పుష్ప' స్టార్ అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అయితే ఈసారి సినిమా వల్ల కాదు.. ఒక వివాదాస్పద ఆరోపణ వల్ల. కావేరీ బారువా అనే బ్రాండ్ మేనేజర్ ఒక పాడ్‌కాస్ట్‌లో అల్లు అర్జున్‌ను కలవడానికి వెళ్లినప్పుడు తనకు ఎదురైన వింత అనుభవాల గురించి చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బన్నీ టీమ్ సీరియస్‌గా స్పందించింది.

'స్వీకృతి టాక్స్' అనే పాడ్‌కాస్ట్‌లో కావేరీ మాట్లాడుతూ.. "హైదరాబాద్ మెగాస్టార్ అల్లు అర్జున్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు.. ఆయన ట...