భారతదేశం, మే 25 -- ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసింది. రేపు అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు వద్ద ఉండొద్దని అధికారులు కోరారు.
మంగళవారం నాటికి పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.