భారతదేశం, జనవరి 25 -- తమిళ చిత్ర పరిశ్రమలో తల అజిత్ కుమార్, దళపతి విజయ్ అభిమానుల మధ్య ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా అజిత్ 2011 నాటి సంచలన చిత్రం 'మంగాత్తా' (తెలుగులో గ్యాంబ్లర్) రీ రిలీజ్ సందర్భంగా ఈ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. థియేటర్ లోపల జరిగిన ఒక దాడి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

కారాకుడిలోని పాండియన్ సినిమాస్‌లో 'మంగాత్తా' స్క్రీనింగ్ జరుగుతుండగా ఒక చేదు ఘటన చోటుచేసుకుంది. అజిత్ ఫ్యాన్స్ అంతా సినిమాను ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక విజయ్ ఫ్యాన్ తన దళపతి కొత్త రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (TVK) జెండాను థియేటర్ లోపల ఊపాడు.

అజిత్ సినిమా థియేటర్‌లో విజయ్ టీవీకే జెండా పట్టుకుని దళపతి అభిమాని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అజిత్ ఫ్యాన్స్ విజయ్ అభిమానిపై మూకు...