భారతదేశం, జూన్ 7 -- రూ. 2వేల నోట్లను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. ఇక ఇప్పుడు రూ. 500 ఓట్లు కూడా రద్దు అవుతాయని గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి కేంద్రం తాజాగా చెక్ పెట్టింది! 2026 మార్చ్ నుంచి రూ. 500 నోట్లు చెలామణిలో ఉండవని వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
2026 మార్చ్ నాటికి రూ. 500 నోట్లు రద్దు అవుతాయని క్యాపిటల్ టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి వీడియో బయటకు వచ్చింది. 12 నిమిషాల నిడివిగల ఈ వీడియో జూన్ 2 నుంచి ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఫలితంగా ప్రజల్లో అయోమయం, భయాందోళనలు నెలకొన్నాయి.
ఇక ఇప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలపై స్పందించింది.
"రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అటువంటి ప్రకటన చేయలేదు. ప్రజలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.