భారతదేశం, డిసెంబర్ 24 -- న్యూ ఇయర్ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయదారులు, వినియోగదారులకు ఊరటనిచ్చేలా..డిసెంబర్ 31వ తేదీన మద్యం విక్రయాల వేళలను పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక జీవోను జారీ చేసింది.

ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12:00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఇక బార్లు, క్లబ్బులు , టూరిజం ప్రాంతాల్లోని హోటళ్లు, అలాగే ప్రత్యేకంగా అనుమతి పొందిన ఈవెంట్ నిర్వాహకులకు రాత్రి ఒంటి గంట వరకు పని చేయడానికి అనుమతి ఉంటుంది.

మరోవైపు న్యూ ఇయర్ వేళ హద్దుదాటి ప్రవర్తించే వారిపై పోలీస్ శాఖ నిఘా పెట్టనుంది. డిసెంబర్ 27వ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ కూడా ప్రత్యేక తనిఖీలు , డ్రైవ్స్ చేపట్టనుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా వచ...