భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు గిరి ప్రదక్షిణపై ఆసక్తి పెరిగింది. అందులో భాగంగా ఎక్కువగా తమళినాడు రాష్ట్రంలోని అరుణాచలం ఎక్కువగా వెళ్తున్నారు భక్తులు. అరుణాచలం ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా నమ్ముతారు. అలాంటి ప్రదేశంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ గిరి ప్రదక్షిణ చేయవచ్చు.

శ్రీకాళహస్తిలో 22 కిలో మీటర్ల గిరి ప్రదక్షిణను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. భక్తులకు ఇది ఒక మంచి అవకాశం. చాలా మంది పౌరులు ఈ చర్యను స్వాగతిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయం చుట్టూ 22 కి.మీ. గిరిప్రదక్షిణ మార్గాన్ని సచివాలయం నుండి ఉప ముఖ్యమంత్రి వర్చువల్ మోడ్‌లో ప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శాసనసభ్యులు బొజ్జల వెంకట ...