Andhrapradesh, సెప్టెంబర్ 28 -- అనంతపురం జిల్లా కొర్రపాడు గ్రామంలోని గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. వేడి చేసి ఉంచిన పాల గిన్నెలో పడి 16 నెలల బాలిక మృతి చెందింది. సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. కొర్రపాడు బాలికల గురుకుల పాఠశాలలో కృష్ణవేణి మహిళా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఆమెకు అక్షిత అనే 16 నెలల పాప ఉంది. అయితే గత శనివారం కృష్ణవేణి పాఠశాలలోని వంటగదిలో టీ తాగడానికి వెళ్లింది. తల్లిని అనుసరిస్తూనే ఆ చిన్నారి కూడా వెళ్లింది. అయితే ఈ విషయాన్ని తల్లి గమనించలేదు. అప్పటికే గదిలో 20 లీటర్ల పాలను వేడి చేసి ఓ పెద్ద పాత్రలో ఉంచారు.

ఈ క్రమంలోనే వంటగదిలోకి వెళ్లిన చిన్నారి. ప్రమాదవశాత్తు పాల గిన్నెలో పడింది. వెంటనే గుర్తించిన తల్లి బయటకు తీసినా అప్పటికే 70 శాతం గాయాలయ్యాయి....