భారతదేశం, మే 10 -- ఏమీ యాచించని నిస్వార్థ ప్రేమమూర్తి అమ్మ. అలాంటి ఓ త‌ల్లి కథతో సందేశాత్మక తెర‌కెక్కుతోన్న షార్ట్ ఫిల్మ్ అమ్మ‌. ప్ర‌ముఖ భ‌ర‌త‌నాట్య క‌ళాకారిణి ఇంద్రాణి దావులూరి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ షార్ట్ ఫిల్మ్ మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మే 11న యూట్యూబ్‌లో రిలీజ్ అవుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూనే హరీష్ బన్నాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డైలాగ్స్‌ను కూడా స‌మ‌కూర్చాడు.

అమ్మ అంటే ఆలనా, అమ్మ అంటే ఆప్యాయత, అమ్మ అంటే అనురాగం. అలాంటి అమ్మ విలువను గుర్తిస్తూ ప్ర‌తి ఒక్క‌రిలో ఆలోచ‌న‌ను రేకెత్తించేలా ఈ షార్ట్ ఫిల్మ్ ఉండ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ చెబుతోన్నారు.

ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఇంద్రాణి దావులూరి అమ్మ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఆమె న‌ట‌న హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. నిస్వార్థంగా త‌న కుటుంబాన్ని, పిల్ల‌ల...