Hyderabad, మే 8 -- అమ్మను వర్ణించడానికి ఎలా పదాలు, పాటలు సరిపోవు. సృష్టికే మూలం అమ్మ అయినప్పుడు ఆమెను ఏమని పొగడగలం. అలాంటి అమ్మల కోసం ప్రత్యేకంగా ఓ రోజును ప్రతి ఏటా మనం జరుపుకుంటాం. ఈ ఏడాది మదర్స్ డే వచ్చేస్తోంది. ఈ సందర్భంగా అమ్మ పాడే జోల పాట అంటూ గతేడాది వచ్చి సంచలనం సృష్టించిన పాట గురించి తెలుసుకుందాం.

అమ్మపాట అంటూ గతేడాది మిట్టపల్లి స్టూడియోస్ యూట్యూబ్ ఛానెల్ నుంచి ఓ అద్భుతమైన సాంగ్ రిలీజైంది. మిట్టపల్లి సురేందర్ ఈ పాటను రాయగా.. జాహ్నవి ఎర్రం పాడింది. సిస్కో డిస్కో అందించిన మ్యూజిక్ ఈ సాంగ్ ను ప్రతి తెలుగు ఇంటికీ తీసుకెళ్లింది.

అమ్మ పాడే జోలి పాటలోని మాధుర్యానికి కాస్త ఆధునికతను జోడించి కంపోజ్ చేసిన మ్యూజిక్ యువతను బాగా ఆకట్టుకుంది. ఇక జాహ్నవి వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో యూట్యూబ్ లో ఈ పాట ఇప్పటికే 9 కోట్లకుపైగా వ్యూస్ ...