భారతదేశం, మే 19 -- అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఎముకకు వ్యాపించిన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. మూత్ర సంబంధ లక్షణాలు కనిపించడంతో శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా వ్యాధి నిర్ధారణ అయినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
గ్లీసన్ స్కోరును ఉపయోగించి ప్రోస్టేట్ క్యాన్సర్ అంచనా వేస్తారు. ఇది 1 నుంచి 10 మధ్యలో ఉంటుంది. ఆరోగ్యకరమైన వాటితో పోలిస్తే క్యాన్సర్ కణాలు ఎంత అసాధారణమైనవో సూచిస్తుంది.
అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, బైడెన్‌కి గ్లీసన్ స్కోరు 9 వచ్చింది. అంటే వ్యాధి అత్యంత తీవ్ర రూపాన్ని సూచిస్తుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ సాధారణంగా మెటాస్టాసిస్ అయినప్పుడు ఎముకలకు వ్యాపిస్తుంది. వ్యాధి ప్రోస్టేట్ దాటి వ్యాపించిన తర్వాత, చికిత్స చేయడం గణనీయంగా కష్టమవుతుంది. ఎందుకంటే మందులు అన్ని కణితులను లక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.