భారతదేశం, సెప్టెంబర్ 19 -- కాలిఫోర్నియాలో ఉంటున్న తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను అక్కడి పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన సెప్టెంబర్ 3న జరిగినట్లు అతని కుటుంబం తెలిపింది. చనిపోయిన వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మొహమ్మద్ నిజాముద్దీన్‌గా గుర్తించారు. చిన్న గొడవతో రూమ్‌మేట్ మధ్య గొడవ జరిగిందని, పోలీసులు వచ్చిన తర్వాత ఈ దుర్ఘటన జరిగిందని మృతుడి తండ్రి మీడియాకు తెలిపారు.

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్ 2016లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. ఫ్లోరిడా కాలేజీలో ఎంఎస్ పూర్తి చేసిన తరువాత, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ప్రమోషన్ రావడంతో కాలిఫోర్నియాకు మారారు. అయితే, కొద్ది రోజుల క్రితం తన కొడుకును పోలీసులు కాల్చి చంపారని ఒక స్నేహితుడి ద్వారా తెలిసిందని నిజాముద్దీన్ తండ్రి మొహమ్మద్ హస్నుద్దీన్ ఆ...