భారతదేశం, మే 19 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఏడాది మూడు విడతల్లో రూ. 20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాది మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేస్తుంది.
అన్నదాత సుఖీభవ పథకం కింద మిగిలిన రూ.14 వేలు రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తారు. అంటే ప్రతి విడతలో రైతులకు రూ.6500 జమ చేయనున్నారు. అయితే పీఎం కిసాన్, ఫార్మర్ రిజిస్ట్రీ డేటా ఆధారంగా అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది.
ఈసారి పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
జూన్ నెలలో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ డబ్బులతో కలిపి అన్నదాత సుఖీభవ పెట్టుబడి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.