భారతదేశం, అక్టోబర్ 8 -- మీకు డబ్బు అవసరమైనప్పుడు, మీరు అప్పు ఇచ్చే సంస్థను (బ్యాంకు, ఎన్‌బీఎఫ్‌సీ లేదా ఫిన్‌టెక్ సంస్థ) ఆశ్రయించవచ్చు. మీరు అప్పుగా తీసుకునే డబ్బుపై వడ్డీ రేటు అనేది మీ క్రెడిట్ స్కోరు, ఆదాయ స్థాయి ఆధారంగా తక్కువగా లేదా ఎక్కువగా ఉండవచ్చు.

మీరు ఎంత మొత్తం అప్పుగా తీసుకోవాలనేది మీ అవసరాన్ని బట్టి ఉంటుంది కానీ పర్సనల్ లోన్​పై విధించే వడ్డీ రేటు మాత్రం అదనపు భారం. ఈ రుణాలకు ఎలాంటి హామీ ఉండదు కాబట్టి, సాధారణంగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా (11-24 శాతం) ఉంటాయి. అయితే, పర్సనల్ లోన్‌కు ఎంత వడ్డీ రేటు ఉంటే అది మరీ ఎక్కువ అని పరిగణించవచ్చు? మీరు రుణం ఒప్పందంపై సంతకం చేసే ముందు, ఈ ముఖ్యమైన అంశాలను తప్పకుండా గమనించండి..

I. ఈఎంఐ:

ముందుగా, మీ నెలవారీ పర్సనల్​ లోన్​ ఈఎంఐ (వడ్డీ, అసలు కలిపి) మొత్తం మీ నెలవారీ ఆదాయంలో సగం కం...