భారతదేశం, ఫిబ్రవరి 12 -- తెలుగు సినిమా నిర్మాతలు, డిస్టిబ్యూటర్ల మధ్య వివాదాలు చాలా రోజులుగా ఉన్నాయి. దీనితో తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదులు వస్తుండటంతో పెద్దలు తలలు పట్టుకునే పరిస్థితి. చాలా వరకు ఒప్పందలు రాతపూర్వకంగా లేకపోవడంతో వివాదాలు సద్దుమణగడం లేదు. దీంతో టాలీవుడ్ వ్యాపార పద్ధతుల్లో మరింత క్రమశిక్షణ తీసుకురావాలనే లక్ష్యంతో ఒక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నిర్మాతలు, పంపిణీదారుల మధ్య రాతపూర్వక ఒప్పందాలను తప్పనిసరి చేసింది.

అంటే లావాదేవీ జరిగిన 15 రోజుల్లోపు అమలు చేసిన ఒప్పందం కాపీని సమర్పించకపోతే ఫిర్యాదులను స్వీకరించబోమని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. సంబంధిత వారందరికీ అధికారిక సమాచారంలో సినిమా పంపిణీ, ఇతర వాణిజ్య లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంది. అయితే చాలా సందర్భాలలో నిర్మాతలు, డ...