భారతదేశం, ఫిబ్రవరి 14 -- 'మర్డర్ 2', 'ఘోస్ట్' వంటి సినిమాలలో తన నటనతో గుర్తింపు పొందిన నటుడు ప్రశాంత్ నారాయణ్. అతడు తాజాగా తోటి నటుడు కార్తీక్ ఆర్యన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కార్తీక్ ఆర్యన్‌ను ఒక "టెర్రిబుల్" (దారుణమైన) నటుడిగా అభివర్ణిస్తూ, అతని చుట్టూ ఉన్నవాళ్ళు అతన్ని అనవసరంగా హైప్ చేస్తున్నారని విమర్శించాడు. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. కార్తీక్ ఆర్యన్ కేవలం తన అదృష్టం, తల్లిదండ్రుల పుణ్యం వల్లే బాలీవుడ్‌లో బతుకుతున్నాడని అన్నాడు.

'బాలీవుడ్ బబుల్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమకాలీన నటుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కార్తీక్ ఆర్యన్ నటనా సామర్థ్యాన్ని విమర్శిస్తూ.. "మా దగ్గర ఉన్న అత్యంత చెత్త నటుల్లో అతను ఒకడని నేను అనుకుంటున్నాను. కానీ అతను చాలా అదృష్టవంతుడు. కేవలం తన తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లే అతను ఇంకా...