భారతదేశం, జనవరి 14 -- అఫీషియల్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడో తెలిసింది. భోగి సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని వీడియోతో అనౌన్స్ చేశారు. తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా తర్వాత అల్లు అర్జున్-లోకేష్ మూవీ పట్టాలెక్కనుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలబోతున్నారు. సినిమా కోసం పనిచేయనున్నారు. ఏఏ23 (వర్కింగ్ టైటిల్)కు ఈ సెన్సేషనల్ కాంబినేషన్ సెట్ అయింది. నెలల తరబడి జరిగిన ఊహాగానాలకు తెరదించుతూ, నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ భోగి పండుగ (జనవరి 14) రోజున ఈ చిత్రాన్ని ప్రకటించారు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కిక్కిిచ్చే న్యూస్ ఇది. మకర సంక్రాంతికి ముందు బుధవారం నాడు అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన...