భారతదేశం, నవంబర్ 25 -- బెంగళూరుకు చెందిన ఒక టెక్ నిపుణుడు గూగుల్ 'నానో బనానా' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ను ఉపయోగించి అచ్చుగుద్దినట్టు, నిజమైనవిగా కనిపించే పాన్, ఆధార్ కార్డులను సృష్టించారు! ఏఐ రూపొందించిన ఈ చిత్రాలను ఆయన ట్విట్టర్​లో పంచుకున్నారు. నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేయడం ఎంత సులభమో చూపించడానికి ఆయన ఈ కార్డుల ఫొటోలను షేర్​ చేశారు.

"నానో బనానా చాలా బాగుంది. ఇప్పుడు అదే సమస్య. ఇది అత్యంత కచ్చితత్వంతో నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించగలదు. పాతకాలపు చిత్ర ధృవీకరణ వ్యవస్థలు కచ్చితంగా విఫలమవుతాయి. ఇమాజినరీ వ్యక్తి పాన్, ఆధార్ కార్డుల ఉదాహరణలను షేర్​ చేస్తున్నాను," అని హర్వీన్ సింగ్ చద్దా పోస్ట్ చేశారు.

ఆయన షేర్​ చేసిన రెండు ఫొటోలు ఫేక్​ కార్డులను చూపిస్తున్నాయి. చూసిన వెంటనే అవే నిజమైనవిగా కనిపిస్తాయి! అయితే, కొంచ...