భారతదేశం, మే 31 -- అక్కినేని ఇంట పెళ్లిబాజాలు అతిత్వరలో మోగనున్నాయి. కింగ్ నాగార్జున చిన్న కుమారుడు, హీరో అక్కినేని అఖిల్ వివాహం జూన్‌లోనే జరగనుంది. తన ప్రేయసి జైనాబ్ రవ్ద్‌జీని అఖిల్ పెళ్లాడనున్నారు. గతేడాది నవంబర్లోనే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు వివాహానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో అఖిల్ పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కింగ్ నాగార్జున, అమల ఆహ్వానించారు.
అఖిల్ - జైనాబ్ల పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికారు. అఖిల్ తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున, అమలతో పాటు జైనాబ్ పేరెంట్స్ నేడు (మే 31) రేవంత్‌ను కలిశారు. జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి.
అఖిల్, జైనాబ్ పెళ్లి వేడుక జూన్ 6వ తేదీన జరుగుతుందని సమాచారం. హైదరాబాద్‌లోని అన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.