భారతదేశం, నవంబర్ 15 -- స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన నాలుగో సినిమా అఖండ 2. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. అలాగే, సంయుక్త మీనన్ ముఖ్య పాత్ర పోషిస్తుంటే.. హీరో ఆది పినిశెట్టి ఓ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నాడు.

బాలీవుడ్ నటి హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర చేస్తోంది. ఇక తాజాగా అఖండ 2 సినిమా నుంచి ది తాండవం పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అఖండ 2 ది తాండవం సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.

డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఇది ఒక సినిమా కాదు భారతదేశ ఆత్మ. భారతదేశ ధర్మం. ఈ సినిమా చూసిన తర్వాత మీరు అదే ఫీల్ అవుతారు. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్లి ఆనందంగా చూసే సినిమా ఇది. మన దేశం మన వేదం మన...