భారతదేశం, మార్చి 23 -- జీవీ ప్ర‌కాష్ కుమార్ హీరోగా న‌టించిన జాంబీ థ్రిల్ల‌ర్ మూవీ కింగ్‌స్ట‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కోలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్న‌ది. ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంద‌ని స‌మాచారం.

కింగ్‌స్ట‌న్ మూవీకి క‌మ‌ల్ ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో జీవీ ప్ర‌కాష్‌కుమార్‌కు జోడీగా దివ్య‌భార‌తి హీరోయిన్‌గా న‌టించింది. చేత‌న్‌, నితిన్ స‌త్య కీల‌క పాత్ర‌లు పోషించారు. హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా ఈ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కూడా జీవీ ప్ర‌కాష్ కుమార్ వ్య‌వ‌హ‌రించాడు.

జీవీ ప్ర‌కాష్ కుమా...