భారతదేశం, ఫిబ్రవరి 6 -- Zomato to Eternal: దీపిందర్ గోయల్ నేతృత్వంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కంపెనీ పేరు మారింది. జొమాటో పేరును ఎటర్నల్ గా మార్చారు. అందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. అయితే, ఎటర్నల్ అనే పేరును అంతర్గతంగా గత రెండు సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. తాజాగా, జొమాటో గురువారం కంపెనీ పేరును "ఎటర్నల్" గా మార్చనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ బోర్డు పేరు మార్పుకు ఆమోదం తెలిపిందని, ఈ మార్పుకు వాటాదారులు కూడా మద్దతు ఇవ్వాలని దీపిందర్ గోయల్ గురువారం షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో కోరారు.

''మా కార్పొరేట్ వెబ్సైట్ కూడా zomato.com నుంచి eternal.com మారుతుంది. మా స్టాక్ టిక్కర్ ను జొమాటో నుంచి ఎటర్నల్ కు మారుస్తాం. జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ ప్యూర్ అనే నాలుగు ప్రధాన వ్యాపారాలు ఉంటాయి'' అని దీపిందర్ గోయల్ వాట...