భారతదేశం, మార్చి 15 -- Zomato delivery guy: సోషల్ యాక్టివిస్ట్, ఇన్ఫ్లుయెన్సర్ కిరణ్ వర్మ మార్చి 14 న ఫేస్బుక్ పోస్ట్ లో ఒక ఆసక్తికర అనుభవాన్ని వివరించారు. హోలీ 2025 పండుగ రోజు సాయంత్రం సమయంలో ఒక జొమాటో డెలివరీ బోయ్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన ఆహారాన్ని తింటున్న విషయాన్ని గుర్తించానని, అయితే, ఆ సమయంలో అతడి గురించి తప్పుగా భావించానని వివరించాడు. ఆ డెలివరీ బోయ్ చేసింది తప్పో, కాదో మనం నిర్ణయించలేమన్నారు.

నోయిడాలో తాను కారు పార్కింగ్ చేస్తుండగా ఓ జొమాటో డెలివరీ బోయ్ తన బైక్ పై కూర్చొని భోజనం చేయడం చూశానని వర్మ తన పోస్ట్ లో పేర్కొన్నారు. బైక్ ఉన్న ప్రదేశంలో వర్మ తన కారును పార్క్ చేయాలని అనుకోవడంతో, మరో పార్కింగ్ స్థలం లేకపోవడంతో, రైడర్ తన భోజనం ముగించే వరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నాడు. డెలివరీ పార్టనర్ ఫోటో తీసిన వర్మ, అతను వేరొకరు ఆర్డర్ చేసి...