భారతదేశం, ఏప్రిల్ 5 -- Zero Poverty P4 Policy : అట్టడుగున ఉన్న పేదల అభ్యున్నతికి ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పీ4 కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ముఖ్యమంత్రి పిలుపు మేరకు... పేదలకు చేయూతను అందించేలా పీ4 కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు సంపన్నవర్గాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు మార్గదర్శకులుగా ఉండి...బంగారు కుటుంబాలకు సాయంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా సొంత నిధులతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించి ఇవ్వడానికి గుంటూరు జిల్లాలో ఒక పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చారు.

గుంటూరు జిల్లా కాకమాను మండలంలో రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొమ్మమూరు కెనాల్ ద్వారా నీటి సౌకర్యం ఉన్నా... చివరి భూములకు నీరు అందడం లేదు. ఇక్కడ లిఫ్ట్ నిర్మిస్తే ఈ ప్రాంత రైతుల కష్టాలు తీరతాయి. దీంతో ఈ సమస్యను పరిష్కరించడాన...