భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఈ డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ కార్యకలాపాలతోపాటుగా సైబర్ అటాక్స్ కూడా ఎక్కువే అవుతున్నాయి. రోజురోజుకు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులను వాడుతున్నారు. సాధారణంగా ఫిషింగ్ లింక్‌లు, అనుమానాస్పద ఫైల్‌లను క్లిక్ చేస్తే.. హ్యాక్ చేయవచ్చు అని వింటుంటాం. కానీ ఇప్పుడు జీరో క్లిక్ హ్యాక్ వంటి కొత్త పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. దీనిలో ఏ లింక్‌పై క్లిక్ చేయకుండానే పరికరాన్ని హ్యాక్ చేస్తున్నారు హ్యాకర్లు. ఈ జీరో క్లిక్ హ్యాక్ అంటే ఏంటి? చూద్దాం..

జీరో క్లిక్ హ్యాక్ అనేది ఓ రకమైన సైబర్ దాడి. దీనిలో హ్యాకర్లు వినియోగదారులు ఎలాంటి పనిని తమ ఫోన్‌లో చేయకున్నా.. పరికరాన్ని హ్యాక్ చేస్తారు. సాంప్రదాయ ఫిషింగ్ దాడుల మాదిరిగా కాకుండా దీనికి ఎటువంటి లింక్‌లపై క్లిక్ చేయడం లేదా అనుమానాస్పద ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం అవసరం లేదు. హ్యాకర్లు ఫోన...