భారతదేశం, మార్చి 4 -- Zepto's Aadit Palicha: దీపిందర్ గోయల్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని జెప్టో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆదిత్ పాలిచా అన్నారు. తన స్టార్టప్ జెప్టో డబ్బును అధికంగా ఖర్చు చేస్తోందని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ చేసిన ఆరోపణలను అదిత్ పాలిచా ఖండించారు. గోయల్ జొమాటోను ప్రారంభించినప్పుడు తన వయస్సు కేవలం 5 సంవత్సరాలు మాత్రమేనని ఈ సందర్భంగా ఈ మధ్యాహ్నం పంచుకున్న లింక్డ్ ఇన్ పోస్ట్ లో ఆదిత్ పాలిచా వెల్లడించాడు.

తమ క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో ఒక్కో త్రైమాసికానికి రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తోందన్న దీపిందర్ గోయల్ ఆరోపణలను జెప్టో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆదిత్ పాలిచా ఖండించారు. "ఈ ప్రకటన పూర్తిగా అవాస్తవం మరియు మేము మా ఆర్థిక ప్రకటనలను బహిరంగంగా దాఖలు చేసినప్పుడు ఇది స్పష్టమవుతుంది" అని పాలిచా తన లింక్డ్ఇన్ పోస్ట్ లో చెప్పారు. భారతదేశంలో శ...