భారతదేశం, డిసెంబర్ 28 -- జెప్టో ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ. 11,000 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రహస్య మార్గం (Confidential Route): జెప్టో 'కాన్ఫిడెన్షియల్ ప్రీ-ఫైలింగ్' విధానాన్ని ఎంచుకుంది. దీనివల్ల కంపెనీ తన ముసాయిదా పత్రాలను (DRHP) సెబీకి సమర్పించినప్పటికీ, అవి వెంటనే బహిరంగం కావు. సెబీ నుంచి ప్రాథమిక ఫీడ్‌బ్యాక్ వచ్చాక, మార్కెట్ పరిస్థితులను బట్టి పబ్లిక్ ఫైలింగ్‌కు వెళ్లేందుకు ఈ మార్గం వీలు కల్పిస్తుంది.

లిస్టింగ్ సమయం: 2026వ సంవత్సరంలో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇది జరిగితే, అతి తక్కువ వ్యవధిలోనే మార్కెట్లోకి ప్రవేశించిన స్టార్టప్‌లలో ఒకటిగా జైప్టో నిలుస్తుంది.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ డ్రాపౌట్స్ ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రా స్థాపించిన జెప్టో, కేవలం 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రిని డెలివ...